: భారతీయుల సమాచారాన్ని తస్కరిస్తున్న అమెరికా


అమెరికాకు చెందిన నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ(ఎన్ఎస్ఏ) నిఘా మార్గాల్లో భారతీయుల సమాచారాన్ని భారీగా సేకరిస్తోందని బ్రిటన్ పత్రిక గార్డియన్ పేర్కొంది. ఇలా ఎన్ఎస్ఏ సేకరిస్తున్నజాబితాలో భారత్ ఐదో స్థానంలో ఉందని వెల్లడించింది. భారత్ లోని కంప్యూటర్ నెట్ వర్కుల్లోకి చొరబడి ఒక్క మార్చి నెలలోనే 630కోట్ల పీసుల ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సేకరించిందని పేర్కొంది.

భారత్ కంటే అత్యధికంగా ఇరాన్ నుంచి 1400కోట్ల పీసులు, పాకిస్థాన్ 1350కోట్లు, జోర్డాన్ 1270 కోట్లు, ఈజిప్టు నుంచి 760కోట్ల పీసుల సమాచారాన్ని ఎస్ఎస్ఏ సేకరించిందని తెలిపింది. ఇలా రహస్యంగా సమాచారం సేకరించి, విశ్లేషించేందుకు ఎన్ఎస్ఏ ఒక టూల్ ను రూపొందించిందని గార్డియన్ వెల్లడించింది. ప్రిజం ప్రాజెక్టు పేరుతో ఎన్ఎస్ఏ ఈ దొంగపనులు చక్కబెడుతోంది. మొత్తానికి అగ్రరాజ్యం తన బుద్దులు పోనిచ్చుకోలేదు. ఇలా రహస్యంగా సమాచారం సేకరించి తనకు అనుకూలంగా మలుచుకుని ప్రపంచంపై తన ఆధిపత్యం నిలుపుకోవాలన్న అమెరికా ప్రయత్నాల్లో భాగమే ఇదంటున్నారు. అయితే, తమ సర్వర్లలోకి ప్రవేశించేందుకు అమెరికా సహా ఏ ప్రభుత్వానికి అనుమతి, అవకాశం లేదని గూగుల్, ఫేస్ బుక్ ఇప్పటికే స్పష్టం చేశాయి.

  • Loading...

More Telugu News