: సైఫ్ అలీఖాన్ యాడ్ కు పోలీసుల మోకాలడ్డు


బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న ఓ వాణిజ్య ప్రకటన పోలీసుల కారణంగా నిలిచిపోయింది. 'సియారామ్స్' అడ్వర్టైజ్ మెంట్ లో ఓ చిన్న హెలికాప్టర్ ను వినియోగిస్తున్నారు. ఈ యాడ్ ను జైపూర్లో చిత్రీకరిస్తున్నారు. అయితే, తమ అనుమతి లేకుండా ఈ హెలికాప్టర్ స్థానిక స్టార్ హోటల్ కు చెందిన హెలిపాడ్ లో దిగడం పట్ల పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో ప్రొడక్షన్ కంపెనీ ప్రొడ్యూసర్ రాజేశ్ కుమార్ ను, జైపూర్ కు చెందిన ఎంటర్ టైన్ మెంట్ కంపెనీ ఉద్యోగి అజయ్ శర్మలను అరెస్టు చేశారు. హెలికాప్టర్ ను సీజ్ చేశారు. హెలికాప్టర్ దిగేందుకు తాము అనుమతించినట్టుగా వీరిద్దరూ ఫోర్జరీకి పాల్పడి నకిలీ అనుమతి పత్రాలను సృష్టించినట్టు పోలీసులు తెలిపారు. కాగా, ఈ అరెస్టులు చోటు చేసుకున్న సమయంలో హీరో సైఫ్ అలీ ఖాన్ హోటల్లోనే ఉన్నాడట.

  • Loading...

More Telugu News