: శాకాహారికి మాంసాహారం సప్లయ్.. స్పైస్ జెట్ కు జరిమానా
శాకాహారం ఆర్డర్ చేస్తే మాంసాహారం తెచ్చిచ్చినందుకు ప్రయాణికుడికి 15,000 జరిమానాగా చెల్లించాలని ఢిల్లీ వినియోగదారుల ఫోరం విమానయాన సంస్థ స్పైస్ జెట్ ను ఆదేశించింది. గజియాబాద్ కు చెందిన బిసి మత్తపాటి 2009లో జూన్ 8న బెంగళూరు నుంచి ఢిల్లీకి స్పైస్ జెట్ విమానంలో ప్రయాణించాడు. వెజ్ శాండ్ విచ్ తేవాలని కోరగా, క్రూ సిబ్బంది నాన్ వెజ్ శాండ్ విచ్ తెచ్చిచ్చారు. దీనిపై ఆగ్రహించిన మత్తపాటి ఎయిర్ లైన్స్ నిర్లక్ష్యానికి గాను 4.5లక్షల పరిహారం ఇప్పించాలని కోరుతూ ఢిల్లీ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు. కేసును విచారించిన ఫోరం ఇది కచ్చితంగా విమానయాన సిబ్బంది నిర్లక్ష్యమేనని స్పష్టం చేసింది. ఇందుకు 10,000 రూపాయలు, న్యాయపరమైన ఖర్చులకు మరో 5,000 రూపాయలు చెల్లించాలని స్పైస్ జెట్ ను ఆదేశించింది.