: బోణీ కొట్టేందుకు ఆసీస్ పో(ఆ)రాటం
చాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ తో మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు పోరాడుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 6 వికెట్లకు 269 పరుగులు చేయగా.. ఆసీస్ 30 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లకు 115 పరుగులు చేసింది. కెప్టెన్ బెయిలీ 42, వోగ్స్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. కంగారూలు గెలవాలంటే 20 ఓవర్లలో 155 పరుగులు చేయాలి. చేతిలో 7 వికెట్లున్నాయి.