: శ్రీవారి సన్నిధిలో మరో కుంభకోణం
ప్రముఖ ఆధ్మాత్మిక కేంద్రం తిరుమలలో మరో కుంభకోణం చోటుచేసుకుంది. ప్రత్యేక దర్శన టికెట్లకు నకిలీ టికెట్లు ముద్రించి అవినీతికి పాల్పడ్డారు కొందరు అక్రమార్కులు. రూ. 300 ల ప్రత్యేక దర్శన టికెట్లకు నకిలీలు సృష్టించిన కొందరు వ్యక్తులు సుమారు రూ. 41 లక్షలు సొమ్ము చేసుకున్నారు. ఈ నిర్వాకంలో ఆంధ్రాబ్యాంకు ఔట్ సోర్సింగ్ సిబ్బంది చేతివాటం ఉన్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది. 2011 డిసెంబర్ నుంచి 2012 నవంబరు మధ్య కాలంలో ఈ అవినీతి చోటు చేసుకుందని టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ అక్రమాలకు సంబంధించి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.