: ఇంగ్లాండ్ బ్యాటింగ్ మొదలైంది
ఛాంపియన్స్ ట్రోఫీ మూడో మ్యాచ్ లో ఇంగ్లాండుతో ఆస్ట్రేలియా తలపడుతోంది. ఇంగ్లాండ్ జట్టు టాస్ గెలిచి బ్యాంటిగ్ ఎంచుకుంది. బర్మింగ్ హామ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఫేవరేట్ గా ఇంగ్లాండ్ బరిలో దిగుతుండగా భారత్, పాక్ మధ్య మ్యాచ్ కు ఎంత పోటీ ఉంటుందో అంతే ఉత్కంఠ ఆసీస్, ఇంగ్లీష్ జట్లకు మధ్య పోరు కూడా రగిలిస్తుంది. దీంతో ఈ రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరుగనుంది. ఈ మ్యాచ్ కు ఆసీస్ సారధి క్లార్క్ వెన్నునొప్పి కారణంగా వైదొలగడంతో, బెయిలీ కెప్టెన్ గా భాధ్యతలు స్వీకరించాడు. తొలుత కుక్, బెల్ లతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ మూడు ఓవర్లకు 12 పరుగులు చేసింది.