: పిరమిడ్ పత్రీజీ అక్రమాలపై విచారణ ప్రారంభం


పిరమిడ్ ధ్యాన సొసైటీ అధ్యక్షుడు, ఆధ్యాత్మిక వేత్త పత్రీజీ అక్రమాలపై విచారణ ప్రారంభమైంది.  మహబూబ్ నగర్ జిల్లాలో, విశాఖ నగరంలో భూ అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఈయనపై ఉన్నాయి. అలాగే కొన్ని రోజుల క్రితం మహబూబ్ నగర్ జిల్లా కడ్తాల్ లో పిరమిడ్ ధ్యాన సమావేశాల సందర్భంగా పత్రీజీ ప్రవర్తనపై కూడా దుమారం రేగింది.

మహిళల్ని కౌగిలించుకుని పత్రీజీ వెకిలి చేష్టలకు పాల్పడిన సంఘటనలు మీడియాలో ప్రముఖంగా ప్రచారం అయిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర మానవహక్కుల సంఘంలో ఫిర్యాదు దాఖలైంది. పోలీసులు కూడా కేసు నమోదు చేశారు.

ఈ నేపథ్యంలో పత్రీజీ అక్రమాలపై  జాయింట్ కలెక్టర్ నేటి నుంచి విచారణ చేసి ఈ నెల 20న రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి నివేదిక ఇవ్వనున్నారు. మరోవైపు సీఐడీ పోలీసులు కూడా విచారణ చేయనున్నారు. 

  • Loading...

More Telugu News