: కుంద్రా తక్కువోడేం కాదు!
బెట్టింగ్ ఆరోపణలు ఎదుర్కొటున్న రాజ్ కుంద్రాకు సంబంధించిన సంచలన విషయం ఒకటి బయటపడింది. బెట్టింగ్ కు కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో టీ20 లీగ్ ఆరంభించేందుకు మూడేళ్ల క్రితమే ప్రయత్నాలు ప్రారంభించాడట, కానీ లలిత్ మోడీ చెక్ చెప్పడంతో ఆ నిర్ణయాన్ని వదిలేసాడని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. యూఏఈలో టీ20 లీగ్ ఆరంభించేందుకు అక్కడి విద్యాశాఖా మంత్రి షేక్ నయన్ తో మంతనాలు జరిపారు. ఇందులో బీసీసీఐ ఈ లీగ్ కు మద్దతు తెలిపేలా చూడాలని షేక్ నయన్ కోరారు. లేకుంటే ఈ ఆఫర్ పాకిస్థాన్ టీంకు ఇస్తామని తెలిపారని లలిత్ మోడీకి కుంద్రా తెలిపారట దీనికి మోడీ ఐపీఎల్ ఫ్రాంచైజీ జట్టుకు యజమానిగా ఉంటూ వేరే లీగ్ కు మద్దతివ్వడం బీసీసీఐ నిబంధనలని ఉల్లంఘించడం క్రిందకు వస్తాయని తెలపడంతో రాజ్ కుంద్రా తన ప్రయత్నాన్ని విరమించుకున్నారు.