: కవ్వింపు చర్యలకు దిగిన పాక్.. భారత సైనికుడి కాల్చివేత


పొరుగుదేశం పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతోంది. ఈ క్రమంలో ఓ భారత సైనికుడిని పొట్టనబెట్టుకుంది. జమ్మూకాశ్మీర్లోని పూంచ్ సెక్టార్ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతంలో కాల్పుల విరమణ అమల్లో ఉన్నా, దాయాది దేశం ఆ నిబంధనలను తుంగలోతొక్కి తన నైజాన్ని మరోసారి చాటుకుంది. ప్రస్తుతం పూంచ్ ప్రాంతంలో భారత్, పాక్ దళాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. తొలుత పాక్ సైనికులే కాల్పులు ఆరంభించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News