: మరోసారి రెచ్చిపోయిన వైఎస్ భారతి!


ఇంతకుముందోసారి జగన్ అక్రమాస్తుల కేసు విచారణ సందర్భంగా సీబీఐ అధికారులకు శాపనార్థాలు పెట్టిన వైఎస్ భారతి మరోసారి అలాంటి ప్రవర్తనతో వార్తల్లోకెక్కారు. నేడు జగన్ ను కోర్టుకు తీసుకువస్తోన్న తరుణంలోనూ అలాగే రెచ్చిపోయారు. నాంపల్లి సీబీఐ కోర్టు వద్దకు భారీ సంఖ్యలో వైఎస్సార్సీపీ కార్యకర్తలతో కలిసి భారతి ర్యాలీగా వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, 'మమ్మల్నే ఆపుతారా..?' అంటూ జగన్ సతీమణి తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయింది.

కోర్టు ప్రాంగణంలోకి వెళ్ళేందుకు ఇతరులకు అనుమతి లేదని ఆ పోలీసులు చెప్పడమే ఆమె ఆవేశానికి కారణం. ఈ విధంగా వాగ్వాదం జరుగుతుండగానే వైఎస్ భారతి ఓ పోలీసుపై చేయి చేసుకుంది. దీంతో, ఏంచేయాలో పాలుపోని పోలీసులు నిరుత్తరుల్లా నిలుచుండిపోయారు. జరిగిన సంఘటన చూసిన న్యాయవాదులు వైఎస్సార్సీపీ నేతల తీరుపట్ల మండిపడ్డారు. ఓ దశలో జగన్ వర్గీయులు లాయర్లను సైతం నెట్టివేయడం గమనార్హం.

  • Loading...

More Telugu News