: గోల్కొండ కోట దత్తత


దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆరు పురాతన స్మారక కట్టడాలను దత్తత తీసుకుని వాటిని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దే బాధ్యతను ఓఎన్ జీసీ సంస్థ దక్కించుకుంది. కేంద్ర పర్యటకశాఖ ప్రతిపాదించిన పరిశుభ్రతా భారత్ ఉద్యమంలో భాగంగా ఓఎన్ జీసీ ఈ బాధ్యతలు తీసుకోనుంది. ఈ ఉద్యమ కార్యక్రమంలో భాగంగా తాజ్ మహల్, ఎల్లోరా గుహలు, ఎలిఫెంటా గుహలు, ఎర్రకోట, మహా బలిపురంలోని కట్టడాలు, గోల్కొండ కోట లను మరింత ఆకర్షణీయంగా, సుందరంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దనున్నారు. ఈ ఆరు కట్టడాల బాధ్యతను కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కె చిరంజీవి తీసుకుని భారత పురావస్తు శాఖతో మాట్లాడి ఖరారు చేసారు. వీటితో పాటు దేశంలోని మరిన్ని కట్టడాలు సుందరంగా ఆకర్షణీయంగా ఉండాలన్నది కేంద్ర పర్యాటకశాఖ లక్ష్యం.

  • Loading...

More Telugu News