: రామచంద్రయ్యకు ఢోకాలేదు: చిరంజీవి
తన అనుయాయి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సి. రామచంద్రయ్య పదవికే ఢోకాలేదని కేంద్ర మంత్రి చిరంజీవి ఉద్ఘాటించారు. చిరంజీవి సీఎం కావాలని కోరుకుంటున్న రామచంద్రయ్యపై సీఎం కిరణ్ గుర్రుగా ఉండడమే కాకుండా, ఆయనను పదవీచ్యుతుణ్ణి చేసేందుకు పావులు కదపడం ప్రారంభించారు. ఈ విషయాన్ని పసిగట్టిన చిరు అధినేత్రి సోనియాతో సమావేశమై తన పలుకుబడి ఉపయోగించినట్టు తెలుస్తోంది.
చిరంజీవి నేడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, రామచంద్రయ్యను మంత్రి పదవి నుంచి తప్పించడం జరగదని చెప్పారు. ఇక సోనియాతో రాష్ట్ర వ్యవహారాలపైనా చర్చించానని చెప్పిన చిరు.. త్వరలోనే తెలంగాణపై ప్రకటన ఉంటుందని పాత పాటే పాడారు.