: శిల్పాశెట్టి శ్రీవారు బాగా లాసయ్యారు!
రాజ్ కుంద్రా బిజినెస్ మేన్ గా, సినీ నిర్మాతగా, ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ యజమానిగా దేశంలోని వ్యాపార వర్గాల్లో మంచి పేరున్న వ్యక్తి. అలాంటి కుంద్రా డబ్బులు పోయి, పరువు మంటగలిసి జైలుపాలవ్వడానికి రెడీ అవుతున్నాడు. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో రాజ్ కుంద్రా ప్రమేయముందని చండీలా చెప్పడంతో రాజస్థాన్ రాయల్స్ యజమానిని పోలీసులు ప్రశ్నించారు. పోలీసు విచారణలో కుంద్రా పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు. తాను బెట్టింగ్ కు పాల్పడినట్టు, అందులో కోటి వరకూ నష్టపోయినట్టు తెలిపాడు.