: ప్రత్యేక కేటగిరి ఖైదీగా విజయసాయి
కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఇంతకుముందులాగే తనను ప్రత్యేక కేటగిరి ఖైదీగా పరిగణించాలన్న ఆడిటర్ విజయ సాయి రెడ్డి అభ్యర్ధనను సీబీఐ కోర్టు అంగీకరించింది. ఈ మేరకు విజయసాయిని ప్రత్యేక కేటగిరి ఖైదీగా పరిగణించాలని జైలు అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. కాగా, గతంలో ఈ కేసులో ఇచ్చిన మధ్యంతర బెయిల్ ను రద్దు చేయడం, అనంతరం ఇచ్చిన గడువు ముగియడంతో విజయసాయి బుధవారం సీబీఐ కోర్టు ఎదుట లొంగిపోయారు. దాంతో కోర్టు 17 వరకు జ్యుడిషియల్ కస్టడి విధించడంతో ఆయనను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు.