: శతక్కొట్టిన ధావన్, ఇండియా 213/2


ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెంచరీ నమోదైంది. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి మ్యాచ్ లో అంచనాలకు తగ్గట్టు రాణించి ధాటిగా ఆడిన శిఖర్ ధావన్ కేవలం 80 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్సర్ తో శతకం అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో ధావన్ కు ఇదే తొలి వన్డే సెంచరీ కావడం విశేషం. దినేష్ కార్తిక్ తో కలిసి క్రీజులో ఉన్న శిఖర్ 105 పరుగులతో ఆడుతున్నాడు. 31 పరుగులు వద్ద సోత్సొబే బౌలింగ్ లో డీప్ మిడ్ వికెట్ వద్ద ఆమ్లా క్యాచ్ పట్టడంతో కోహ్లీ వెనుదిరిగాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 213/2

  • Loading...

More Telugu News