: హస్తినలో రాహుల్ గాంధీ కీలక భేటీ
కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు హోదాలో రాహుల్ గాంధీ అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించారు. మొత్తం 16 రాష్ట్రాల నుంచి 70 మంది వరకు నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
2014 ఎన్నికలకు పార్టీ సమాయత్తమవ్వడంపై భేటీలో ప్రధానంగా చర్చించారు. తొమ్మిది గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల గురించిన సమగ్ర సమాచారాన్ని రాహుల్ నేతలను అడిగి తెలుసుకున్నారు
రాష్ట్రంలో తాజా పరిస్థితిని, సహకార ఎన్నికల తీరు, తెలంగాణ వంటి అంశాలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ... రాహుల్ కు వివరించారు. అన్ని రాష్ట్రాల్లోనూ క్షేత్ర స్థాయిలో పర్యటించాలని రాహుల్ ఈ భేటీలో నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రేపు కూడా ఈ భేటీ కొనసాగనుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జనార్థన్ ద్వివేది తెలిపారు.