: 13ఏళ్ల నాటి కేసులో ఐదుగురికి మరణశిక్ష


పదమూడు సంవత్సరాల నాటి ఓ కేసులో బంగ్లాదేశ్ కోర్టు ఐదుగురికి మరణశిక్ష విధించింది. ముగ్గురికి జీవితకాల జైలు శిక్ష విధించింది. ఇంతకీ ఏమిటా కేసు అనుకుంటున్నారు కదా? ఆ వివరాల్లోకి వెళితే, వృత్తిరీత్యా న్యాయవాది అయిన కాళిదాస్ బరాల్ అనే వ్యక్తి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో హిందు, బౌద్ధ-క్రైస్తవ ఓక్యా పరిషత్ కేంద్ర నాయకుడు, అవామీ లీగ్ స్థానిక నేత. 2000 సంవత్సరంలో పూజ ఉడ్జపాన్ పరిషద్ ప్రెసిడెంట్ గానూ పనిచేశారు. అప్పట్లో జరిగిన ఓ రాజకీయ సంఘటనకు సంబంధించి బరాల్ బాధితుడు. ఈ ఘటనతో అతనికి, పార్టీలోని వ్యక్తులకు కొన్ని విభేదాలు వచ్చాయి. దాంతో ఆయన్ను చంపాలని నిర్ణయించుకున్న సొంత పార్టీ వ్యక్తులే 2000 ఆగస్టు 20న బరాల్ ను తుద ముట్టించారని కుటుంబ సభ్యుడు ఒకరు తెలిపారు. అయితే కోర్టు ఇచ్చిన తీర్పుతో అసంతృప్తి చెందిన ఆయన భార్య న్యాయంకోసం పైకోర్టుకు వెళ్తామని చెప్పింది.

  • Loading...

More Telugu News