: టీఆర్ఎస్ కు ఆమాత్రం తెలీదా? : బీజేపీ రాజేశ్వర్ రావు


టీఆర్ఎస్ అవాకులు చవాకులు పేలడం మానుకోవాలని బీజెపీ నేత డాక్టర్ రాజేశ్వర్ రావు ధ్వజమెత్తారు. ఒకర్ని విమర్శించేముందు టీఆర్ఎస్ ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. జార్ఖాండ్ రాష్ట్ర ఏర్పాటు బీజేపీ ద్వారానే అన్న విషయం తెలియకపోవడం ఆ పార్టీ అవగాహనా రాహిత్యమని విమర్శించారు. కాంగ్రెస్ తో జతకట్టి మోసపోయిన టీఆర్ఎస్ కు తమను విమర్శించే అర్హత లేదని అభిప్రాయపడ్డారు. జేఏసీలో భాగస్వామి కనుక తాము విమర్శించడం లేదని తెలిపారు.

  • Loading...

More Telugu News