: టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా
చాంపియన్స్ ట్రోఫీ ఆరంభ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వన్డే వరల్డ్ చాంపియన్, ఐసీసీ నెంబర్ వన్ వన్డే టీమ్ భారత్ తో పోరును ను తాము తేలిగ్గా తీసుకోబోమని సఫారీ సారథి ఏబీ డివిలీర్స్ చెప్పాడు. కాగా, పటిష్టమైన టీమిండియా బ్యాటింగ్ లైనప్ కు ముకుతాడు వేసేందుకు నలుగురు పేసర్లతో బరిలో దిగుతామని ఏబీ వెల్లడించాడు. గాయంతో స్టెయిన్ తప్పుకోవడంతో ఆ జట్టు బౌలింగ్ భారం ప్రధానంగా సీనియర్ పేసర్ మోర్నీ మోర్కెల్ పై పడనుంది. కాగా, ఈ మ్యాచ్ కు వేదికైన కార్డిఫ్ పిచ్ పై ధోనీ సేన.. ఆసీస్ ను 65 పరుగులకే కుప్పకూల్చిన నేపథ్యంలో ఫ్యాన్స్ మరోసారి టీమిండియా బౌలింగ్ మ్యాజిక్ కోసం ఎదురుచూస్తున్నారు.