: గుంటూరులో 18 నుంచి షర్మిల పాదయాత్ర


ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్రతో రాజకీయ వేడి రాజుకున్న గుంటూరు జిల్లాలో మరో నేత కాళ్లకు పని చెప్పనున్నారు. ఈ నెల 18 నుంచి గుంటూరు జిల్లాలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత షర్మిల  'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్ర మొదలుకానుందని పాదయాత్ర సమన్వయ కర్త తలశిల రఘురాం తెలిపారు.

ఫిబ్రవరి 18 సాయంత్రం గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలోకి షర్మిల పాదయాత్ర ప్రవేశించనుంది. జిల్లా వ్యాప్తంగా 13 నియోజక వర్గాల్లో 270 కిలోమీటర్లు షర్మిల పాదయాత్ర చేయనున్నట్లు రఘురాం చెప్పారు.

  • Loading...

More Telugu News