: రాహుల్ క్షమాపణ చెప్పు.. లేకుంటే 500 కోట్లు కట్టాలి: ఏజీపీ
అసోం గణపరిషత్ పార్టీ రాహుల్ గాంధీకి లీగల్ నోటీసులు పంపింది. అసోం గణపరిషత్ తిరుగుబాటు దారుల సహకారంతో అధికారంలోకి వచ్చిందంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ఇలా స్పందించింది. చేసిన వ్యాఖ్యలకు 15 రోజుల్లోగా క్షమాపణ చెప్పాలని కోరింది. లేకుంటే రాహుల్ పై 500 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తామని ఏజీపీ యువజన విభాగం అధ్యక్షుడు కిషోర్ ఉపాధ్యాయ మీడియాతో చెప్పారు.