: కిక్కును కూడా లెక్కించొచ్చు!


మనం ఎంతమేర ఆల్కహాల్‌ తాగామో కూడా ఇట్టే కొలిచి చెప్పేయొచ్చు అంటున్నారు ఆష్ట్రేలియాకు చెందిన ఒక వైన్‌ కంపెనీ వారు. నిజానికి మనం ఎంత మేర తాగినా, అందులోని ఆల్కహాల్‌ మోతాదు ఎంతుంటుందో లెక్కించడం కష్టం. అయితే మీ గ్లాసులో ఉన్న మద్యాన్ని స్కాన్‌చేసి అందులో ఉన్న ఆల్కహాల్‌ శాతాన్ని లెక్కించి, మీరు ఏ మేరకు ఆల్కహాల్‌ను సేవించారో ఇట్టే చెప్పేయొచ్చు అంటున్నారు వీరు.

ఆష్ట్రేలియా వైన్‌ కంపెనీ ది జాకబ్‌ క్రీక్స్‌ ఒక ప్రత్యేకమైన యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌తో గ్లాసులో ఉన్న మద్యాన్ని స్కాన్‌చేసి అందులో ఉన్న ఆల్కహాల్‌ శాతాన్ని లెక్కిస్తుంది. దీన్నిబట్టి మీరు ఎంతమేర ఆల్కహాల్‌ సేవించారో లెక్కించి ఈ యాప్‌ చెప్పేస్తుందట. అంటే మీరు తాగుతున్న మద్యం మోతాదును బట్టి అందులోని ఆల్కహాల్‌ను ఇది లెక్కించి చెప్పేస్తుందన్నమాట.

  • Loading...

More Telugu News