: చాపర్ల కొనుగోలు ఒప్పందం రద్దు దిశగా కేంద్రం


హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణానికి కేంద్ర ప్రభుత్వం తెర దించే ప్రయత్నం చేస్తోంది. వీవీఐపీల భద్రత కోసం రూ. 3,546 కోట్ల రూపాయలతో కొనాలనుకున్న పన్నెండు అగస్టా వెస్ట్ ల్యాండ్ ఎడబ్యూ -101 విమానాల కొనుగోలు ఒప్పందాన్నిరక్షణ శాఖ రద్దు చేయబోతోంది. ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయకూడదో వారం రోజుల్లో తెలపాలని చాపర్లను సరఫరా చేస్తున్న యూకే దేశానికి చెందిన ఫిన్ మెకానికా సంస్థకు షో కాజ్ నోటీసులను జారీ చేసింది.

ఫిబ్రవరి 21 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో సీబీఐ నివేదిక అందించే వరకు కూడా ఆగే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఒప్పందం రద్దు చేయడమే మేలని, లేకుంటే పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపక్షాలకు మరో అస్త్రం అందించినట్లు అవుతుందని కేంద్రం భావిస్తోంది.

ఈ ఒప్పందం ప్రకారం ఇప్పటికే 50% పైగా సొమ్మును భారత ప్రభుత్వం సదరు సంస్థకు చెల్లించింది. దీంతో మరో మూడు విడతలుగా మార్చి, మే, జూలై నెలల్లో మూడేసి హెలికాఫ్టర్లు భారత్ దిగుమతి చేసుకోవాల్సి ఉంది.

  • Loading...

More Telugu News