: 11న జాక్టో ధర్నా


అపరిష్కృత సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయులు భారీ ఆందోళనకు సిద్దమౌతున్నారు. ఈ నెల 11న హైదరాబాద్ లో నోషనల్ ఇంక్రిమెంట్లు, పీఈటీల స్థాయి పెంపు తదితర సమస్యల పరిష్కారానికి పెద్దఎత్తున ఆందోళనకు దిగుతున్నట్లు ఉపాధ్యాయసంఘాల జాక్టో నాయకులు బుధవారం ప్రకటించారు. ఆ రోజు ఇందిరాపార్క్ వద్ద రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి వచ్చిన ఉపాధ్యాయులతో ధర్నా చేపట్టనున్నట్టు తెలిపారు. వీటిపై ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్తులో సచివాలయం, అసెంబ్లీ ముట్టడికి సైతం వెనుకాడేది లేదని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News