: రెండ్రోజుల్లో రాష్ట్రమంతటా రుతుపవనాల విస్తరణ
రుతుపవనాలు వేగంగా ముందుకు దూసుకెళుతున్నాయి. ఇప్పటికే రాయలసీమను చుట్టేసిన రుతుపవనాలు, కోస్తాంధ్ర, తెలంగాణలోకీ ప్రవేశించాయి. మరో రెండు మూడు రోజుల్లో రాష్ట్రమంతటా రుతుపవనాల విస్తరణ పూర్తవుతుందని విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రం తెలిపింది. రుతుపవనాలు చురుగ్గా ఉండడంతోపాటు ఉపరితల అల్పపీడన ద్రోణి ప్రభావంతో వచ్చే 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వర్షాలు పడతాయని వెల్లడించింది.