: ఐఫోన్లపై దిగుమతులపై అమెరికాలో నిషేధం


అమెరికాలో యాపిల్ పై శాంసంగ్ పాక్షిక విజయం సాధించింది. ఐఫోన్, ఐప్యాడ్ ల తయారీలో యాపిల్ తమ పేటెంట్ లను ఉల్లంఘించిందని శాంసంగ్ న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో అమెరికాలోని ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్ ఐఫోన్4(ఏటీ అండ్ టీ మోడల్), ఐపాడ్ దిగుమతులపై నిషేధం విధించింది. ఇవన్నీ పాత వెర్షన్ల ఫోన్లు. దిగుమతులపైనే నిషేధం తప్ప అమెరికాలో తయారీ విక్రయాలపై నిషేధం లేదు. అయితే, 60 రోజుల్లోగా ఈ ఉత్తర్వులను రద్దు చేసే అధికారం అమెరికా అధ్యక్షుడు ఒబామాకు ఉంటుంది. ఒబామా ఇందుకు సానుకూలంగా ఉన్నారని అంటున్నారు.

  • Loading...

More Telugu News