: దేశానికి జీహాదీ సంస్థల నుంచి ముప్పు
ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన ఢిల్లీలో ముఖ్యమంత్రుల సదస్సు ప్రారంభమైంది. ఈ సమావేశానికి మన రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డీజీపీ దినేష్ రెడ్డిలు హాజరయ్యారు. ఆయా రాష్ట్రాలకు టెర్రరిజం వ్యతిరేకపోరాట సామర్థ్యం ఉందా? లేదా? గూఢచారి వ్యవస్థ పటిష్టంగా ఉందా? లేదా? మావోయిస్టులు బలం పుంజుకుంటున్న ప్రాంతాల్లో రాష్ట్రాలు సమర్ధవంతమైన భద్రతాచర్యలు తీసుకుంటున్నారా? అనే అంశాలపై ఈ చర్చిస్తున్నారు. తాజాగా జరిగిన ఛత్తీస్ గఢ్ వంటి దారుణమారణ హోమాన్ని అడ్డుకునేందుకు మరింత సమర్ధవంతమైన వ్యవస్థ వుండాలని కేంద్ర హొమ్ మంత్రి అన్నారు. ఈ సందర్భంగా దేశ అంతర్గత భద్రత పటిష్టంగా ఉందని ఆయన తెలిపారు.
ప్రధాని మాట్లాడుతూ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని రాష్ట్రాల డీజీపీలకు సూచించారు. అలాగే హింసావాదం వీడి వచ్చే తీవ్రవాద సంస్థలతో చర్చలకు సుముఖంగా ఉన్నట్టు తెలిపారు. అంతర్గత భద్రతలో రాష్ట్రాలు సహాయసహకారాలు అందజేసుకోవాలని సూచించారు. జీహాదీ సంస్థల నుంచి దేశానికి తీవ్రముప్పు పొంచి ఉందని, రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని హోం మంత్రి సూచించారు. ఈ సమావేశానికి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ దూరంగా ఉన్నారు.