: బీజేపీతో శత్రుత్వం లేదు: కెటీఆర్
బీజేపీతో తమకు శత్రుత్వం లేదని, వున్నదల్లా మిత్ర వైరుధ్యమేనని టీఆర్ఎస్ ఎమ్మెల్యే తారకరామారావు అన్నారు. బీజేపీయే కాదు తెలంగాణ కోసం పనిచేసే అన్ని పార్టీలు, సంస్థలు తమకు సోదరులతో సమానమని చెప్పారు. అభిప్రాయ బేధాలుంటే పరిష్కరించుకుంటామన్నారు. తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్, బీజేపీ రెండూ మోసం చేశాయని ఆరోపించారు. నాడు తెలంగాణకు చంద్రబాబు అడ్డు అంటున్న బీజేపీ రేపు వెంకయ్యనాయుడు అడ్డు అని అంటుందేమో అని ఎద్దేవా చేశారు.