: కంగారూలను ఊచకోత కోసిన ఉమేశ్ యాదవ్
టీమిండియా యువ పేసర్ ఉమేశ్ యాదవ్ నిప్పులు చెరిగే బౌలింగ్ కు ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ దాసోహమైంది. చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా ఇంగ్లండ్ లో జరుగుతున్న ప్రాక్టీసు మ్యాచ్ లో ఉమేశ్ ధాటికి ఆసీస్ 28 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ ఐదు వికెట్లు ఉమేశ్ ఖాతాలో చేరడం విశేషం. అంతకుముందు భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దినేశ్ కార్తీక్ అజేయంగా 146 పరుగులు చేశాడు.