: ఆ రికార్డు మాత్రం '3 ఇడియట్స్'దే!


ఇటీవల కాలంలో పలు బాలీవుడ్ చిత్రాలు వంద కోట్ల క్లబ్ లో చేరినా.. భారత చలనచిత్ర చరిత్రలో అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా '3 ఇడియట్స్' స్థానం మాత్రం పదిలంగానే ఉంది. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా 2009లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొదటి రోజు నుంచే హిట్ టాక్ స్వంతం చేసుకున్న ఈ సినిమా రికార్డులు తిరగరాస్తూ రూ.209 కోట్లు కొల్లగొట్టింది. చైనాలోనూ ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ రాబట్టడం విశేషం. చైనా ప్రధాని లీ కెకియాంగ్ కూడా '3 ఇడియట్స్' చూసి అమీర్ అభిమానిగా మారిపోయారంటేనే అర్థం అవుతోంది ఆ సినిమా స్టామినా ఏంటో!

రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అమీర్ ఖాన్, మాధవన్, శర్మాన్ జోషి, కరీనా కపూర్ ముఖ్యపాత్రలు పోషించారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. దక్షిణాది నటుడు మాధవన్ ఈ చిత్రానికి స్క్రిప్టు వర్క్ నిర్వహించాడు.

  • Loading...

More Telugu News