: అధికారులపై గిరిజనుల తిరుగుబాటు
దున్నే వాడిదే భూమి... పండించే వాడే ఆసామి అన్న నినాదాన్ని జీర్ణించుకున్నారా గిరిజనులు. ప్రభుత్వ ఆధీనంలో వివాదాస్పదంగా మారి బీడుగా మారుతున్న 200 ఎకరాల భూమిని అధికారులపై తిరగబడి మరీ ఆక్రమించుకున్నారు. వివరాల్లోకి వెళితే... పశ్చిమ గోదావరి జిల్లా టి నర్సాపురం మండలంలోని కొల్లివారి గూడెంలో 200 ఎకరాల విషయంలో ఫారెస్టు అధికారులకు, గ్రామస్థులకు మధ్య గత కొంత కాలంగా వివాదం నలుగుతోంది. మంగళవారం సీపీఐ (ఎమ్ఎల్) జనశక్తి పార్టీ, రైతు కూలీ సంఘాల మద్దతుతో 400 మంది గిరిజనులు ఫారెస్టు అధికారులపై తిరగబడి 200 ఎకరాలు భూమిని ఆక్రమించుకున్నారు.