: సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వానిదే బాధ్యత: టీఎన్జీవో
తెలంగాణ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే తదుపరి పర్యవసానాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలంగాణ ఉద్యోగుల సంఘం ఐకాస హెచ్చరించింది. సకల జనుల సమ్మెలో తెలంగాణ ఉద్యోగులపై నమోదు చేసిన కేసులు తొలగించడంతో పాటు, పదో పీఆర్సీ అమలు చేయాలనీ, లేకపోతే మార్చి 20 తర్వాత సమ్మె తప్పదని టీఎన్జీవో స్పష్టం చేసింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీమాథ్యూకు టీఎన్జీవో నాయకులు ఈరోజు మధ్యాహ్నం సమ్మె నోటీసు అందించారు.