: శ్రీకాళహస్తిలో యువతుల నగ్న దృశ్యాల చిత్రీకరణ
పవిత్ర పుణ్యక్షేత్రంలో ఒక ప్రైవేటు లాడ్జి సిబ్బంది దారుణానికి పాల్పడ్డారు. లాడ్జిలో బసచేసిన తమిళనాడు యువతులు స్నానం చేస్తుండగా సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. దీనిని గమనించిన వారు అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇలాంటి నీచపనులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోకుంటే భక్తులు లాడ్జిలో బస చేయడానికి భయపడే పరిస్థితి వస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.