: మంత్రిగా వెళ్ళి మాజీగా తిరిగొచ్చారు!
డీఎల్ రవీంద్రారెడ్డి.. కొద్దిరోజుల క్రితం వరకు రాష్ట్ర క్యాబినెట్ లో సీనియర్ మంత్రి. అదే హోదాలో లండన్ పర్యటనకు వెళ్ళారు. కానీ, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆలోచనలు మరోలా ఉన్నాయి. తనను అడుగడుగునా విమర్శిస్తోన్న డీఎల్ ను మంత్రివర్గం నుంచి సాగనంపేందుకు అప్పటికే ఆయన రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. డీఎల్ లండన్ విమానం ఎక్కడం, ఆయన్ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తున్నట్టు గవర్నర్ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడడం చకచకా జరిగిపోయాయి.
ఈ నేపథ్యంలో డీఎల్ తన లండన్ పర్యటన ముగించుకుని నేడు హైదరాబాద్ చేరుకున్నారు. మంత్రిగా వెళ్ళి మాజీగా తిరిగిరావడం పట్ల స్పందన కోరగా, డీఎల్ నిరాకరించారు. విషయం తెలియకుండా మాట్లాడడం మంచిదికాదని విమానాశ్రయం వద్ద తనను పలకరించిన మీడియా ప్రతినిధులతో పేర్కొన్నారు.