: కలెక్షన్ కింగ్ 'యే జవానీ హై దీవానీ'
బాలీవుడ్ క్రేజీ కపుల్ రణబీర్ కపూర్, దీపికా పదుకునే నటించిన తాజా చిత్రం 'యే జవానీ హై దీవానీ' సినిమా సూపర్ హిట్టైంది. విడుదలైన తొలి రోజు 19.45 కోట్ల వసూళ్లు సాధించిన ఈ సినిమా, మూడు రోజుల్లోనే 62.11 కోట్లు వసూలు చేసి వంద కోట్ల క్లబ్ లో చేరేందుకు పరుగులు తీస్తోంది. యూత్ ఫుల్ రోమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాకి ఆయన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా, కరణ్ జొహార్ నిర్మించారు.