: 90వ పడిలోకి కరుణానిధి
డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి నేడు 90వ వసంతంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయన నివాసంలోనూ, తర్వాత పార్టీ కార్యాలయం అన్నా అరివాలయంలోనూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు బారులు తీరారు. తొలుత తన ప్రియ పుత్రిక కనిమొళి నివాసంలో, తర్వాత భార్య దయాళు అమ్మాళ్ నివాసంలోను కరుణ పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నారు. తమిళనాడు వ్యాప్తంగా డీఎంకే కార్యకర్తలు, నేతలు బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచి పెట్టి పెద్ద ఎత్తున పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు.