: కేసీఆర్ కు కుళ్లు ఎక్కువ, ఎవరైనా ఎదిగితే చూడలేడు: జగ్గారెడ్డి


తెలంగాణ ప్రజలు మలమలమాడితే కేసీఆర్ కు ఆనందంగా ఉంటుందని ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి విమర్శించారు. దళితుడిని సీఎం చేస్తానని సభల్లో ఊదరగొడుతున్న కేసీఆర్ దళిత ఎంపీలకు మాట్లాడే అవకాశం ఇవ్వరా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలోని నల్లధనం అంతా కేసీఆర్, జగన్ ల వద్దే ఉందని ఆరోపించారు. ఈ రోజు హైదరాబాద్ లో మాట్లాడిన ఆయన కేసీఆర్ తీరును దుయ్యబట్టారు. బహిరంగ సభలో పార్టీలో చేరిన వారినందర్నీ ఆయన ఒకేలా చూడలేదని ఆరోపించారు. కెసీఆర్ కు కుళ్ళు ఎక్కువనీ, ఎవరైనా ఎదిగితే ఆయన చూడలేడని కూడా చెప్పారు.

  • Loading...

More Telugu News