: ఖమ్మం జిల్లాలో మావోయిస్టుల అరెస్ట్
ఖమ్మం జిల్లా పాల్వంచ పోలీసులు ముగ్గురు మావోయిస్టులను ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు. భద్రాచలం నుంచి ఒక వాహనంలో మావోయిస్టులు కొత్తగూడెం వెళుతున్నారంటూ అందిన సమాచారం మేరకు పాల్వంచ పోలీసులు అప్రమత్తమయ్యారు. దారికి అడ్డంగా జీపును నిలిపి మరీ మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు.