: ఇన్ఫోసిస్ షేరుకు మూర్తి బూస్ట్
ప్రతిభ మసకబారుతున్న ఇన్ఫోసిస్ కు మళ్లీ చైర్మన్ గా నారాయణమూర్తి తిరిగి రావడంతో ఈ రోజు స్టాక్ మార్కెట్లో కంపెనీ షేరు బుల్లెట్ రైలులా దూసుకుపోయింది. ఏకంగా 5 శాతం లాభంతో ట్రేడవుతోంది. శుక్రవారం ఈ స్టాక్ బీఎస్ఈలో 2407వద్ద ముగిసింది. మూర్తిని చైర్మన్ గా నియమిస్తూ ఇన్ఫోసిస్ శనివారం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ రోజు బీఎస్ఈలో 117 రూపాయల లాభంతో 2524 వద్ద ప్రారంభమైన షేరు 2624 వద్దకు దూసుకుపోయి 200 రూపాయలు లాభపడింది. ఆ తర్వాత తగ్గుతూ వచ్చి ప్రస్తుతం 2520వద్ద ట్రేడవుతోంది.