: డిమాండ్ల సాధనకు 26న జర్నలిస్టుల మహాప్రదర్శన


డిమాండ్ల సాధన కోసం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫోరం(ఏపీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఈ నెల 26న హైదరాబాద్ లో మహాప్రదర్శన నిర్వహించనున్నారు. దీనిని విజయవంతం చేయాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బి.బసవపున్నయ్య కోరారు. ఇతర రాష్టాలలో వలే ఇక్కడ కూడా జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, సబ్ ఎడిటర్లకు కూడా అక్రిడేషన్ ఇవ్వాలని, అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వీటి సాధన కోసం మహాప్రదర్శన నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ లో సంఘం సమావేశం అనంతరం బసవపున్నయ్య చెప్పారు.

  • Loading...

More Telugu News