: కంటి క్యాన్సర్‌కు చెక్‌ పెట్టొచ్చు


కంటి క్యాన్సర్‌ చాలా అరుదైన క్యాన్సర్‌. ఈ వ్యాధి చాలా తక్కువ మందికి వచ్చే అవకాశముంది. అయితే ఈ క్యాన్సర్‌ కణాలు పెరగకుండా నిలువరించేందుకు ఒక ప్రత్యేకమైన ఔషధాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఈ నూతన ఔషధం క్యాన్సర్‌ కణాలను నివారించినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. 49వ అమెరికా క్లినికల్‌ అంకాలజీ సంఘ సమావేశంలో మెమోరియల్‌ స్లోన్‌ కెట్టేరింగ్‌ క్యాన్సర్‌ పరిశోధనా సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ క్యాన్సర్‌ సోకిన వారికి కనుగుడ్డుపైన మచ్చలు, కనుపాపల ఆకారాల్లో మార్పు, కన్ను నొప్పి తదితర లక్షణాలు ఉంటాయని వారు తెలిపారు.

ప్రస్తుతం ప్రయోగదశలో ఉన్న 'సెలుమిటినబ్‌' అనే ఔషధం అరుదైన కంటి క్యాన్సర్‌ కణాలను నిలువరించినట్టు వారు తెలిపారు. మనుషులపై చేసిన ప్రయోగాల్లో సుమారు 60 శాతం మందిలో ఈ క్యాన్సర్‌ కణాల పరిమాణం తగ్గిందని, 15 శాతం మందిలో పూర్తిగా ఈ వ్యాధి కారక కణాలను నిలువరించగలిగామని ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న రిచర్డ్‌ కార్వజల్‌ తెలిపారు. 84 శాతం మంది రోగుల్లో ఈ క్యాన్సర్‌కు కారణమయ్యే జి.ఎన్‌.ఎ.జి, జి.ఎన్‌.ఎ.11 జన్యువుల్లో పరివర్తనాలు ఉన్నట్లు గుర్తించామని ఆయన తెలిపారు. కాగా మొత్తం క్యాన్సర్‌ బాధితుల్లో ఐదు శాతం మంది అరుదైన కంటి క్యాన్సర్‌తో బాధపడుతుంటారని కార్వజల్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News