: స్పాట్ ఫిక్సింగ్ లో మరో బుకీ అరెస్టు


బీసీసీఐ ప్రత్యేక సమావేశం ఒక వైపు జరుగుతుండగానే స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో బుకీ అరెస్టయ్యాడు. ఐపీఎల్ బెట్టింగ్ కు సంబంధించి ముంబై పోలీసులు పరేశ్ భాటియాను గోవాలో అరెస్టు చేసారు. ఇతను వారం రోజుల క్రిందట గోవాలో బెట్టింగ్ నిర్వహిస్తూ పట్టుబడ్డాడు. అయితే నిన్ననే అతను బెయిల్ మీద విడుదలయ్యాడు. విడుదల కాగానే ముంబై పోలీసులు అతన్ని అరెస్టు చేసారు. మరో వైపు చెన్నైలో బీసీసీఐ ప్రత్యేక సమావేశం హాట్ హాట్ గా జరుగుతోంది.

  • Loading...

More Telugu News