: పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయంలో నిధి
పాలకొల్లులోని పంచారామ క్షేత్రమైన క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయ ధ్వజస్థంభం క్రింద నిధి దొరికింది. గత ఏడాది నవంబరులో ఈ ఆలయ ధ్వజస్తంభం కూలిపోయింది. దీంతో దీన్ని పున:ప్రతిష్టించేందుకు ఆలయాధికారులు నిర్మాణపనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో ధ్వజస్థంభం గుంతలో నిధి బయటపడింది. ఇందులో బంగారం, వెండి, రాగి, కూర్మయంత్రం లభ్యమయ్యాయి. వీటి విలువ మదింపు చేసాక వివరిస్తామని పురావస్తు శాఖాధికారులు తెలిపారు.