: పదవి వదిలేందుకు శ్రీనివాసన్ డిమాండ్స్
స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ ను తొలగించేందుకు రంగం సిద్దమైంది. మరి కాసేపట్లో బీసీసీఐ బోర్డు సమావేశం కానుంది. శ్రీనివాసన్ ను తొలగించడమే ప్రధాన లక్ష్యంగా ఈ సమావేశం జరుగనుంది. గత రెండు వారాలుగా శ్రీనివాసన్ రాజీనామా చేయాలంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ నేపధ్యంలో శ్రీనివాసన్ నాలుగు డిమాండ్లు బోర్డు ముందుంచారు. బీసీసీఐ అధ్యక్షుడిగా బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగ్ మోహన్ దాల్మియాను నియమించాలన్నారు. అలాగే తను నిర్ధోషని తేలితే మళ్లీ పదవి అప్పగించాలని కోరారు. అలాగే ఐసీసీ ముఖ్య సమావేశాలకు తనను ఆహ్వానించాలని డిమాండ్ చేసారు.