: వేశ్య పాత్రతో అలరించనున్న తెలుగమ్మాయి


తెలుగు సినిమాల్లో వేశ్య పాత్రల ట్రెండ్ నడుస్తోంది. 'వేదం'లో అనుష్క వేశ్యగా నటించిన దగ్గర్నుంచి ఈ ట్రెండ్ ఊపందుకుంది. సహజంగా బాలీవుడ్ ను ఫాలో అయ్యే మన హీరోయిన్లకు తాజా ప్యాషన్ వేశ్య పాత్ర. అందుకే తాజాగా, 'పవిత్ర'గా శ్రియ కన్పిస్తే, 'ప్రేమ ఒక మైకం'లో ఛార్మి వేశ్యగా ప్రేక్షకుల పల్స్ వేగం పెంచేందుకు సిద్దమౌతోంది. తాజాగా ఈ జాబితాలో అచ్చ తెలుగు అమ్మాయి అర్చన కూడా వచ్చి చేరింది. 'కమలతో నా ప్రయాణం' అనే సినిమాలో వేశ్యగా నటించనుంది. వేశ్యగా నటిస్తే తమ నటనా శక్తిని ప్రదర్శించే అవకాశముంటుందని మన సుందరాంగుల ఆశ. ఎన్ని సినిమాల్లో నటించినా రాని గుర్తింపు ఒక్క వేశ్యపాత్రతో కొట్టేయొచ్చని మన మగువల ఆలోచన. కనీసం ఈ సినిమా అయినా అర్చనను స్టార్ హీరోయిన్ ను చేస్తుందోమో చూద్దాం!

  • Loading...

More Telugu News