: ల్యాంకో, జీఎంఆర్ కంపెనీలకు ప్రభుత్వం లబ్ధి: కేటీఆర్


ల్యాంకో, జీఎంఆర్ సంస్థలకు లబ్ధి చేకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే తారకరామారావు ఆరోపించారు. ఆ రెండు సంస్థల నుంచి ప్రభుత్వం అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేస్తూ ప్రజలపై భారం మోపుతోందన్నారు. ఈ మేరకు తారకరామారావు హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు.

ల్యాంకో, జీఎంఆర్ సంస్థల అక్రమాలను బయటపెడతామని హెచ్చరించారు. ఎప్పుడూ తెలుగు ప్రజలంటూ మాట్లాడే లగడపాటి రాజగోపాల్ తన ల్యాంకో కంపెనీకి తక్కవ ధరకే గ్యాసు పొందుతూ విద్యుత్ ను మాత్రం ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని చెప్పారు. 

  • Loading...

More Telugu News