: బాలయ్యతో 3 నుంచి కొత్త చిత్రం షూటింగ్: బోయపాటి
బాలకృష్ణతో కొత్త చిత్రానికి బోయపాటి శ్రీనివాసరావు రెడీ అయిపోయారు. ఈ నెల 3 (సోమవారం) నుంచి కొత్త చిత్రం షూటింగ్ మొదలవుతుందని బోయపాటి ఈ రోజు తిరుమలలో చెప్పారు. స్వామి దర్శనం చేసుకున్న అనంతరం ఆయన ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్నారు. వీరి కాంబినేషన్ లోనే 'సింహ' రికార్డులు సృష్టించిన సంగతి అందరికీ ఎరుకే.