: బీసీసీఐ సెక్రటరీ, కోశాధికారి రాజీనామా
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం చినికి చినికి గాలివానలా మారుతోంది. బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలంటూ బీసీసీఐ సెక్రటరీ సంజయ్ జగ్దలే, కోశాధికారి అజయ్ షిర్కే తమ పదవులకు రాజీనామా చేసారు. ఇప్పటికే పలు రాష్ట్రాల క్రికెట్ సంఘాల అధ్యక్షులు శ్రీనివాసన్ రాజీనామా చేయాలని ఒత్తిడి చేసారు. కానీ కొందరు మంత్రులు శ్రీనివాసన్ కు మద్దతుగా నిలిచారు. తాజాగా బీసీసీఐ సెక్రటరీ, కోశాధికారి రాజీనామా శ్రీనివాసన్ రాజీనామాకు బీజం వేస్తుందేమో చూడాలి.