: జగన్ ఆస్తుల కేసులో ఈడీ మూడో అటాచ్ మెంట్


జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ అటాచ్ మెంట్ కు ఆదేశాలు జారీ చేసింది. జూబ్లీహిల్స్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ లోని 34.66 కోట్ల రూపాయల ఫిక్సిడ్ డిపాజిట్లు అటాచ్ చేసింది. దీంతో ఇప్పటివరకూ 229.40 కోట్ల విలువైన జగన్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇప్పటివరకూ జగన్ ఆస్తులను మూడు దశలుగా అటాచ్ చేసింది.

తొలి చార్జిషీటు సందర్భంగా 143 కోట్లు అటాచ్ చేసిన ఈడీ, రెండో ఛార్జీషీటుతో 52.40 కోట్లను జప్తు చేసింది. మూడో చార్జిషీటు సందర్భంగా తాజాగా 34.66 కోట్లను అటాచ్ చేసింది. నాలుగో ఛార్జీ షీటు సందర్భంగా భారీగా సుమారు 800 నుంచి 1000 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేయనుందని సమాచారం. జగతిలో ఏకే దండమూడి, టీ ఆర్ కన్నన్, మాధవ రామచంద్రల పెట్టుబడులకు సంబంధించిన ఫిక్సిడ్ డిపాజిట్లు అటాచ్ చేసింది.

  • Loading...

More Telugu News