: ప్రాణం తీసిన కిరాతకులు
రాష్ట్రంలో పసివారి అపహరణలు పెరుగుతున్నాయి. కిడ్నాపుల కలకలంలో చివరకు బాలలు బలైపోతున్నారు. అనుకున్నంతా అయ్యింది. చిత్తూరు జిల్లా కుప్పంలో మూడు రోజుల క్రితం కిడ్నాప్ కు గురైన పదేళ్ల బాలుడు వికాస్ హత్యకు గురయ్యాడు. కిడ్నాపర్లు డిమాండ్ చేసిన 5 లక్షలు ఇవ్వలేదని బాలుడిని హత్య చేసారని వికాస్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు.